రష్యన్ ఆయిల్‌కు బ్రేక్.. పెట్రోల్ ధరలు పెరగనున్నాయా?
రష్యా నుంచి ముడిచమురు కొనుగోలుపై భారత్‌కు అమెరికా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రష్యా ఆయిల్ దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారత్ రోజుకు సుమారు 2.3 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది.
ఈ పరిస్థితుల్లో రష్యా నుంచి సరఫరాలు తగ్గితే దేశీయ మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఇప్పటికే ఊగిసలాటకు గురవుతుండగా, కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తే భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
[embed]https://youtu.be/3SM9ibAXq7Q?si=fnGCJe-JU8gKCIhn[/embed]
MSc B.Ed.
Leave a Comment
Leave a Comment