తమిళ సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్లు సమాచారం. ఈ సమావేశం ఈ నెల 27వ తేదీన జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో జరిగే ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా కేంద్ర మంత్రులను కూడా విజయ్ కలిసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవల రాజకీయాల్లో చురుకుగా మారిన విజయ్, జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొదటిసారి ప్రధాని మోదీతో విజయ్ భేటీ
[embed]https://youtu.be/3SM9ibAXq7Q?si=fnGCJe-JU8gKCIhn[/embed]
MSc B.Ed.
Leave a Comment
Leave a Comment