TG EAPCET-2026 ఫలితాలు విడుదల.. ఇంటర్ విద్యార్థుల్లో ఉత్సాహం
తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)-2026 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు కలిసి ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈసారి కూడా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
ఇంజినీరింగ్ విభాగంలో మేధుల రుషి అనే విద్యార్థిని 156.64 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆమెకు గణితంలో 78.66, ఫిజిక్స్‌లో 37.98, కెమిస్ట్రీలో 40 మార్కులు వచ్చాయి.
టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో అనుష్-148.70, వందిత్-147.05, మణిదీప్ రెడ్డి-144.44, నిఖిల్-143.30, మల్లారపు ఆర్య-143.28, వివాన్-142.92, శ్రీనాస్ రెడ్డి-140.24, సమీరాజ్-139.85, షైర్-139.78 మార్కులు సాధించారు.
ఈ ఏడాది ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో కలిపి మొత్తం 2,82,196 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ర్యాంక్ కార్డులను కూడా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
[embed]https://youtu.be/3SM9ibAXq7Q?si=fnGCJe-JU8gKCIhn[/embed]
MSc B.Ed.
Leave a Comment
Leave a Comment