ఎబోలా వైరస్ కలకలం.. భారత్‌కు కేంద్రం హెచ్చరికలు
కాంగో, ఉగాండా సహా పలు ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోకి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది.
ప్రత్యేకంగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సరిహద్దు చెక్‌పోస్టుల్లో కట్టుదిట్టమైన ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. జ్వరం, విరేచనాలు, వాంతులు, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు ఉన్న ప్రయాణికులను వెంటనే గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించింది.
ఇప్పటికే 21 రోజుల క్వారంటైన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపినట్లు సమాచారం. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో ఎబోలా కారణంగా 139 మంది మరణించగా, 600కి పైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్య సంస్థలు వెల్లడించాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర భయాందోళనలకు గురికావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.