SSC ద్వారా 12,256 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల ఎంపిక సంఘం (SSC) దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 12,256 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలకు సంబంధించిన పరీక్షలు CBT-1, CBT-2 మరియు అవసరమైన ఇతర ఎంపిక ప్రక్రియల ద్వారా నిర్వహించబడతాయి.
ముఖ్య వివరాలు:
మొత్తం ఖాళీలు: 12,256
పోస్టులు: గ్రూప్-బి, గ్రూప్-సి
వయోపరిమితి: 18 నుంచి 32 సంవత్సరాలు (పోస్టును బట్టి మారవచ్చు)
జీతం: నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 వరకు
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT)
అభ్యర్థులు పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/
నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు.
SSC ద్వారా 12,256 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
[embed]https://youtu.be/3SM9ibAXq7Q?si=fnGCJe-JU8gKCIhn[/embed]
MSc B.Ed.
Leave a Comment
Leave a Comment