విజయ్‌తో లేవిన్ రిలేషన్‌షిప్‌పై స్పందించిన త్రిష.. సోషల్ మీడియాలో వైరల్!
చెన్నై: ప్రముఖ నటి త్రిష కృష్ణన్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, రాజకీయ నాయకుడు విజయ్‌తో తనకు సంబంధం ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో త్రిష చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవల త్రిష తన పెంపుడు కుక్క ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ “Don’t follow in my business” అనే క్యాప్షన్ జత చేసింది. ఈ పోస్ట్‌ను నెటిజన్లు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దనే ఉద్దేశంతోనే ఆమె ఈ సందేశం ఇచ్చినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.
గత కొంతకాలంగా త్రిష వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వాటిపై నేరుగా స్పందించకుండా, తన స్టోరీ ద్వారా పరోక్షంగా సందేశం ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.
త్రిష చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు మరియు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై త్రిష నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
[embed]https://youtu.be/3SM9ibAXq7Q?si=fnGCJe-JU8gKCIhn[/embed]
MSc B.Ed.
Leave a Comment
Leave a Comment