హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై ఎవరికీ గుత్తాధిపత్యం లేదని, తెలంగాణ ప్రజలందరికీ సమాన హక్కులు ఉన్నాయని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan వ్యాఖ్యానించారు. తెలంగాణలో తనను అడ్డుకుంటామని కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
“తెలంగాణ మీ అయ్య జాగీరా? నన్ను హైదరాబాద్‌లో ఎవరు ఆపగలరు? నేను తెలంగాణకు వచ్చినప్పుడు ఎందుకు అడ్డుకుంటారు?” అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, ప్రతి భారతీయ పౌరుడికి దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే హక్కు ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు సంకేతాలు ఇచ్చిన పవన్ కల్యాణ్, పార్టీ శ్రేణులు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశం కూడా నిర్వహించనున్నట్లు సమాచారం.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేన పార్టీ తెలంగాణలో తన ఉనికిని మరింత బలపర్చే దిశగా అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ మీ అయ్య జాగీరా? : పవన్ కల్యాణ్ ఫైర్
[embed]https://youtu.be/3SM9ibAXq7Q?si=fnGCJe-JU8gKCIhn[/embed]
MSc B.Ed.
Leave a Comment
Leave a Comment