వాల్టీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కట్.. కేంద్రం కీలక నిర్ణయం
సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.10 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలకు గ్యాస్ సిలిండర్‌పై అందిస్తున్న సబ్సిడీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ నిబంధన అమల్లో ఉండగా, తాజాగా దీనిపై కేంద్రం మరింత స్పష్టత ఇచ్చింది. ఆదాయం అధికంగా ఉన్న కుటుంబాలు సబ్సిడీ అవసరం లేదనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే నిజంగా అర్హత కలిగిన పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సబ్సిడీ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా అన్యాయంగా సబ్సిడీ పొందుతున్నారని భావిస్తే, ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.
దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 180023333555 ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నంబర్‌కు సమాచారం అందిస్తే అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
ఈ నిర్ణయంపై ప్రజల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మధ్యతరగతి కుటుంబాలపై భారం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
[embed]https://youtu.be/3SM9ibAXq7Q?si=fnGCJe-JU8gKCIhn[/embed]
MSc B.Ed.
Leave a Comment
Leave a Comment